: మోడీ మంత్రి వర్గంలో మొత్తం 45 మంది


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో మొత్తం కేంద్ర మంత్రులు 45 మంది వున్నారు. వీరిలో 23 మంది కేంద్ర మంత్రులు. కాగా, 10 మంది స్వయం ప్రతిపత్తి గల మంత్రులు, మరో 12 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా గంట 15 నిమిషాల పాటు సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం సార్క్ దేశాల అధినేతల సాక్షిగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో సాగింది.

ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఆధ్యాత్మిక, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియగానే రాష్ట్రపతి, ప్రధానితో కేంద్ర మంత్రి వర్గం గ్రూప్ ఫోటో దిగింది. ఆ కార్యక్రమం పూర్తి కాగానే సార్క్ దేశాధినేతలంతా ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు.

  • Loading...

More Telugu News