: కలలను కూడా చిత్రించేస్తార్ట!


కలల్లో మెదిలే చిత్రాలను కూడా వీడియో తీసేసే ఫెసిలిటీ ఉంటే ...? ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు కదా. పొద్దున్నే లేచి అందమైన కలల్ని మరచిపోయినా కూడా ఆ తర్వాత రీవైండ్‌ చేసుకుని చూడొచ్చునని అనుకుంటున్నారు కదా? అలాంటి ఒక యంత్రాన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. ముగ్గురు యువకులపై ఈ యంత్రాన్ని ప్రయోగించారు. ఎమ్మార్‌, ఈఈజీ ఎలక్ట్రోడ్‌ల సాయంతో వారు నిద్రపోతుండగా మెదడులో చర్యలను పరిశీలించారు. వాటికి విజువల్‌ ఇమేజినరీ డీకోడర్‌ను అభివృద్ధి చేశారు. దీంతో ఆ యంత్రం ఆ ముగ్గురు యువకుల కలలను కూడా గుర్తించిందట.

కలల్లో మెదిలే చిత్రాలు చిక్కినా పర్లేదు, తకరార్లు వచ్చినా సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. అది పగలే మేలుకుని ఉండగానే.. వచ్చే ఆలోచనల్ని డీకోడ్‌ చేసి అందులో చిత్రాలను పసిగట్టే టెక్నాలజీ వస్తే గనుక.. ఇక కొంపలు అంటుకుపోతాయని భయంగా ఉందా... జాగ్రత్త మరి! నేడోరేపో అదికూడా వచ్చేస్తుంది.

  • Loading...

More Telugu News