: తాజ్ మహల్ లో ఘనంగా 369వ ఉర్సు ఉత్సవాలు
ఆగ్రాలోని తాజ్ మహల్ లో 369వ ఉర్సు ఉత్సవాలు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా షాజహాన్, ముంతాజ్ సమాధుల వద్ద జరిగే ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవాల్లో పలువురు భక్తులను మీడియా పలకరించగా, పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థించామని అన్నారు. దేశ శాంతి, సౌభాగ్యాల గురించి ప్రార్థనలు చేశామని వారు వెల్లడించారు.