: రైలు ప్రమాదంపై మోడీ విచారం


ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని చురేబ్ రైల్వే స్టేషన్ లో జరిగిన గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఘోర రైలు ప్రమాదంపై కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు అందజేయాలని కేబినెట్ సెక్రటరీకి సూచించారు. వారు తొందరగా కోలుకోవాలని ఆయన ఆక్షాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News