: మోడీకి వ్యతిరేకంగా సందేశాలు... అదుపులో ఐదుగురు
మోడీకి వ్యతిరేకంగా సందేశాలను వాట్స్ యాప్ ద్వారా వ్యాప్తి చేస్తున్న ఐదుగురు విద్యార్థులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు కర్ణాటకలోని భక్తల్ ప్రాంతానికి చెందినవారని సమాచారం. విచారణ అనంతరం నలుగురిని విడుదల చేశారు. వకాస్ అనే విద్యార్థిని మాత్రం బెల్గాం జిల్లా పోలీసులకు అప్పగించారు. అతడిపై బెల్గాం జిల్లా ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.