: మోడీతో పాటు 16 మంది మంత్రుల ప్రమాణం
రేపు సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీతో పాటు... మరో 16 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీమాంధ్ర నుంచి వెంకయ్యనాయుడు, అశోక్ గజపతి రాజు... తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. మోడీ కేబినెట్ లో 40 మందికి మించకుండా కేబినెట్ మంత్రులు ఉండే అవకాశం ఉంది.