: మోడీ ప్రమాణ స్వీకారానికి జయ డుమ్మా?
దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తమిళనాడు సీఎం జయలలిత గైర్హాజరు అవుతున్నారని తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రానుండటంతో... తాను హాజరు కాకూడదని జయ నిర్ణయించుకున్నట్టు సమాచారం. తన తరఫున ప్రతినిధిని కూడా పంపకపోవచ్చని తెలుస్తోంది.