: మోడీ పేరుతో మామిడిపండు
ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత హజీ కలీముల్లా భావి ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ఓ మామిడి పండును ఆవిష్కరించారు. దాని పేరు నమో ఆమ్. కలీముల్లాకు మ్యాంగో కింగ్ అని పేరు. కొత్త కొత్త రకాలను ఈయన క్రాస్ బీడ్ ద్వారా సృష్టిస్తుంటారు. అలా ఓ కొత్త రకానికి మోడీ పేరు పెట్టారు. ఆ రకం పండ్లను మోడీకి తీసుకెళ్లి తినిపించాలనుకుంటున్నట్లు కలీముల్లా చెప్పారు.