: టీడీపీలోకి ఐదుగురు కర్నూలు జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు?


కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ ఖాళీ అవుతోందా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏకంగా జిల్లాకు చెందిన ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధమయినట్టు సమాచారం. వీరిలో కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వీరంతా టీడీపీ అధినేతతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే, కర్నూలు జిల్లాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.

  • Loading...

More Telugu News