: జంట నగరాల్లో నిషేధాజ్ఞలు
హైదరాబాద్, సికిందరాబాద్ లలో జూన్ 1 వరకు నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. నిషేధం అమల్లో ఉన్నన్ని రోజులు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు లాంటివి చేపట్టకూడదని ఆదేశించారు. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జూన్ 2 అపాయింటెడ్ డే కావడంతో, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ చర్య తీసుకున్నారు.