: పురాతన వివాదం పరిష్కారం కోసం పర్యటిస్తున్న పోప్ ఫ్రాన్సిస్
క్రైస్తవ మతానికి సంబంధించిన ఓ పురాతన వివాదం పరిష్కారం కోసం క్యాథలిక్కుల మతగురువు పోప్ ఫ్రాన్సిస్ పశ్చిమాసియాలో పర్యటించేందుకు జోర్డాన్ బయల్దేరారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన క్రైస్తవుల పవిత్ర ప్రాంతాలైన జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలలో పర్యటించనున్నారు. ముస్లింలు, యూదులతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఈ పర్యటనను ఆయన ఉపయోగించుకోనున్నారు.