: నరేంద్రుని ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్న సార్క్ దేశాల అధినేతలు
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు హాజరవుతున్నారు. ఈ నెల 26వ తేదీ, సోమవారం నాడు పార్లమెంటు భవనం ఆవరణలో జరిగే స్వీకార మహోత్సవంలో పాకిస్థాన్ సహా మొత్తం ఎనిమిది దేశాల అధినేతలు పాల్గొంటున్నారు.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే, భూటాన్ ప్రధాని షెరింగ్ టాబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, బంగ్లాదేశ్ పార్లమెంటు స్పీకర్ శిరిన్ షర్మీన్ చౌదురి, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులామ్ వస్తున్నారు.