: శాఖాధిపతుల జాబితాను వెంటనే ప్రకటించాలి: దేవీప్రసాద్
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖల అధిపతుల జాబితాను తక్షణమే ప్రకటించాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. వీరి వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలని కోరారు. తప్పుడు ధ్రువపత్రాలతో తెలంగాణలో ఉండిపోవాలనుకుంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రోజు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.