: మళ్లీ రాహుల్ గాంధీనే మా బాస్ కావాలి: తెలంగాణ యువజన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తామంటున్నారు తెలంగాణ యువజన కాంగ్రెస్ నేతలు. అంతేకాదు, రాహుల్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఎన్నుకోవాలని కూడా వారు అధిష్ఠానానికి సూచించారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా గాంధీభవన్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశమై, పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చినప్పటికీ... ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వైఫల్యం చెందామని ఈ సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.