: తప్పకుండా పెళ్లి చేసుకుంటా: సుస్మితా సేన్


మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి విషయం ఎప్పుడొచ్చినా చేసుకుంటాననే చెబుతూ వస్తోంది. తాజాగా కూడా ఇదే విషయం చెబుతూ తప్పకుండా వివాహం చేసుకుంటానంది కానీ, ఎప్పుడనేది చెప్పలేనంది. 'సమాజం సెట్ చేసిన రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలనేది నేనొప్పుకోను. పద్దెనిమిదేళ్ల దాకా చదువు, ఇరవైఐదు సంవత్సరాలకు పెళ్లి, 27 ఏళ్లకు తల్లి కావడం... దీన్నంతా నేనొప్పుకొను' అని సేన్ చెప్పుకొచ్చింది.

మోడల్ నుంచి నటిగా మారిన సుస్మిత గతంలో దర్శకుడు విక్రమ్ భట్, నటుడు రణదీప్ హుడాలతో కొంతకాలం ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత రినీ, అలీషా అనే ఇద్దరిని దత్తతు చేసుకుని సొంత కుమార్తెల్లా పెంచుకుంటోంది. వారి ఆలన పాలన చూసుకుంటూ జీవితం గడుపుతోందీ ముద్దుగుమ్మ.

  • Loading...

More Telugu News