: మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి షరీఫ్ హాజరవుతారు: పాక్ పీఎంవో


నరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరవుతారని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని ఆంగ్ల ఛానల్ జీ మీడియాకు నిన్న (శుక్రవారం రాత్రి) పంపిన ఓ ఈ-మెయిల్ సమాధానంలో వెల్లడించింది. అయితే, ఇంతవరకు పాక్ అధికారుల నుంచి భారత్ కు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదు. ఆ ప్రకటన కోసమే దేశ అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కు ఆహ్వానం అందించింది. ఈ విషయాన్ని సలీమ్ కూడా నిర్ధారించారు.

  • Loading...

More Telugu News