: ప్రయాణికుడి గొంతు కోసిన హిజ్రాలు
రైళ్లలో హిజ్రాలు చెలరేగిపోతున్నారు. డబ్బుల కోసం ఎంతటి నేరానికైనా వారు తెగిస్తుండడంతో ప్రయాణికులు బెదిరిపోతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో హిజ్రాలు బంగారు ఆభరణం కోసం యువకుడి గొంతునే కోసేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.