: తెలంగాణకు 70 వేల కోట్లు అప్పు...నివేదికపై కేసీఆర్ అభ్యంతరాలు


రాష్ట్ర విభజన కమిటీ అధికారులతో తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనపై అధికారులు ఆయనకు 43 పేజీల నివేదిక సమర్పించారు. అందులో వారు స్పష్టమైన సమాచారం ఉంచారు. పంపకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 70 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు వారు వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడుకోవాలని అధికారులు కేసీఆర్ కు సూచించారు.

నీటి పంపకాల విషయంలో ఎలాంటి తగాదాలు అవసరం లేదని రెండు రాష్ట్రాలకు బ్రిజేష్ ట్రైబ్యునల్ నీటి పంపకాలను చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా బ్రిజేష్ కమిటీ కాలపరిమితిని మరో రెండేళ్లు పొడిగించామని కేసీఆర్ కు తెలిపారు. అలాగే ఆంధ్రా, తెలంగాణకు వేర్వేరుగా గ్రేహౌండ్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. విశాఖ, వరంగల్ లను గ్రేహౌండ్స్ హబ్ లు గా తీర్చిదిద్దనున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం పని చేస్తున్న హైద్రాబాద్ గ్రేహౌండ్స్ ను సెంట్రల్ గ్రేహౌండ్స్ గా మారుస్తామని అధికారులు అన్నారు. దీనికి ఖర్చయ్యే అన్ని నిధులను కేంద్రమే భరిస్తుందని అధికారులు కేసీఆర్ కు వివరించారు. అధికారులు వెల్లడించిన పలు అంశాలపై కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిపై గవర్నర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ అధికారులకు తెలిపారు.

  • Loading...

More Telugu News