: సమాజ్ వాదీ పార్టీకి టాటా చెప్పేసిన అనురాధా చౌదరి
సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అనురాధా చౌదరి ఆ పార్టీకి టాటా చెప్పేశారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ ప్రభుత్వం ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించి రెండు రోజులు కూడా గడవక ముందే... అనురాధ పార్టీని వీడారు. ముజఫర్ నగర్ అల్లర్లను అదుపుచేసేందుకు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని అనురాధా చౌదరి అన్నారు.