: రేపు హస్తిన వెళుతున్న సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం హస్తిన వెళుతున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు. న్యాయపరమైన అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సదస్సులో కిరణ్ పాల్గొంటారు. అనంతరం పనిలో పనిగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్, తదితర పార్టీ పెద్దలతో భేటీ అవుతారు. 

  • Loading...

More Telugu News