: అఖిలేష్ పై మండిపడ్డ ములాయం


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై అతని తండ్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కంగుతినడంపై ఆయన మండిపడ్డారు. ఎస్పీ ఎల్పీ సమావేశంలో ఆయన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావని ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ ను సూటిగా ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని ఆయన అఖిలేష్ యాదవ్ ను మందలించారు.

  • Loading...

More Telugu News