: కేజ్రీవాల్ కు మరో 14 రోజుల రిమాండ్


ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు మరో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. అనంతర విచారణను కోర్టు జూన్ 6కు వాయిదా వేసింది. బీజేపీ నేత నితిన్ గడ్కరీ పరువునష్టం దావా కేసులో రెండు రోజుల కిందట కేజ్రీ కోర్టు ముందుకు హాజరయ్యారు. అయితే, బెయిల్ బాండ్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించడంతో ఆయనను అదుపులోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దాంతో, ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీహార్ జైల్లో ఉంచారు.

  • Loading...

More Telugu News