: ఆంధ్ర బస్సులను అడ్డుకుంటే తీవ్రపరిణామాలుంటాయి: వైవీ రావు
అపాయింటెడ్ డే తర్వాత తరువాత తెలంగాణలో అడుగుపెట్టే ఆంధ్రా బస్సులను అడ్డుకుంటామని పలువురు తెలంగాణ అర్టీసీ నేతల హెచ్చరికలపై సీమాంధ్ర ఈయూ నేత వైవీ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అపాయింటెడ్ డే తరువాత సరైన పర్మిట్లు లేవని ఆంధ్రా వాహనాలను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 10 వేల మంది కార్మికులతో బస్ భవన్ ను ముట్టడిస్తామని ఆయన సవాలు విసిరారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగేవరకు ఇప్పుడు ఉన్న రూల్స్ యథాతథంగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.