: దాడికి దిగిన నలుగురు ఉగ్రవాదులు హతం
అఫ్ఘనిస్థాన్ లోని హెరాత్ లో భారత కాన్సులేట్ పై ఆయుధాలతో విరుచుకుపడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు ఎట్టకేలకు మట్టుబెట్టాయి. తొలుత ముగ్గురు ఉగ్రవాదులేనని భావించారు. కానీ, దాడికి దిగింది నలుగురని తేలింది. ఈ తెల్లవారుజామున 3.15కు ఈ దాడి జరిగింది. హెరాత్ అప్ఘాన్ రాజధాని కాబూల్ కు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాన్సులేట్ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రకటించారు. ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ కు చెందిన బలగాలు అఫ్ఘాన్ దళాలతో కలసి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు.