: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు: దేవీప్రసాద్
జూన్ ఒకటో తేదీ అర్థరాత్రి గన్ పార్క్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ అన్నారు. జూన్ రెండో తేదీన అమరవీరులకు నివాళులు అర్పించనున్నట్లు టీ-ఎన్జీవో నేత దేవీప్రసాద్ చెప్పారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాతే సీఎం తొలి సంతకం చేస్తారన్నారు. జూన్ రెండో తేదీన గగన్ విహార్ లో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవీప్రసాద్ తెలిపారు.