: మోడీ ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్ కు ఆహ్వానం
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నటుడు రజనీకాంత్ కు భారతీయ జనతా పార్టీ ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, రజనీ హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. దేశ వ్యాప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో తమిళనాడులో మోడీ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన రజనీకాంత్ ను కలసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 26 సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.