: దేశ వృద్ధ టెస్టు క్రికెటర్ మాధవ్ మంత్రి కన్నుమూత
భారతదేశ వృద్ధ టెస్టు క్రికెటర్, సునీల్ గవాస్కర్ మేనమామ మాధవ్ మంత్రి (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని స్థానిక ఆసుపత్రిలో ఈ ఉదయం మృతి చెందారు. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ అయిన మాధవ్ కేవలం నాలుగు టెస్టు మ్యాచులు మాత్రమే ఆడారు. అందులో ఒకటి 1951లోభారత్ లో ఆడగా, ఇంగ్లాండు (1952)లో రెండు మ్యాచులు, చివరిది ఢాకా (1954-55)లో ఆడారు. ఆ మ్యాచులో 63 పరుగులు చేసిన ఆయన ఎనిమిది క్యాచ్ లు పట్టారు. మాధవ్ అతి తక్కువ టెస్టు కెరీయర్ లో 75 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమమైంది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడిన సమయంలో జరిగిన ఓ ఘటనలో ఆయనపై వేటు పడింది. అయితే, రంజీ ట్రోఫీలో నిలకడ కలిగిన బ్యాట్స్ మెన్ గా, మెంటర్ గా ఉన్నారు. మాధవ్ తన జీవితాంతం బ్రహ్మచారిగానే వుండిపోయారు.