: జాడలేని సాహస వనిత


పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సాహసవనిత చందాగాయెన్ తప్పిపోయి మూడు రోజులు దాటిపోయినా, ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. హిమాలయాల్లో 8,586 మీటర్ల ఎత్తులో ఉన్న కాంచన్ జంగ పర్వత శిఖరాన్ని ఈ నెల 18న చందాగాయెన్ అధిగమించిన విషయం తెలిసిందే. ఈ రికార్డు సాధించిన తొలి పశ్చిమబెంగాల్ మహిళగా ఆమె గుర్తింపు పొందింది. కాంచన్ జంగ పర్వాతారోహణ పూర్తయ్యాక ఆమె యాలుగ్ కాంగ్ పర్వత శిఖరాన్ని అధిరోహించేందుకు ఇద్దరు షెర్పాల సాయంతో బయల్దేరింది. అయితే, ఆకస్మిక హిమపాతంతో ఇద్దరు షెర్పాలతో పాటు ఆమె ప్రమాదంలో చిక్కుకుని తప్పిపోయింది. వారు లోయలో పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News