: భారత కాన్సులేట్ పై దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం


ఆఫ్గానిస్థాన్ లోని హెరాత్ ప్రావిన్స్ లో భారత కాన్సులేట్ లక్ష్యంగా దాడికి దిగిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరో ఉగ్రవాదితో కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. రాకెట్ ఆధారిత గ్రెనేడ్లు, మెషిన్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగారు. అయితే, కాన్సులేట్ లో ఉన్న సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. హెరాత్ నగరం ఇరాన్ సరిహద్దుల్లో ఉంటుంది. సురక్షిత నగరంగా భావించే ఇక్కడ ఉగ్రవాదులు దాడికి పాల్పడడం భద్రతాదళాలను ఉలిక్కిపడేలా చేసింది.

  • Loading...

More Telugu News