: గవర్నర్ పదవిపై కన్నేసిన యనమల?


టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ పదవిపై కన్నేశారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. మరోవైపు ఆయనను ఉపముఖ్యమంత్రిగా నియమిస్తారనే ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే గవర్నర్ పదవిపైనే తనకు మక్కువ ఉందని సన్నిహితుల వద్ద యనమల ఆకాంక్షను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్ల నియామకం జరగనుంది. ఈ క్రమంలో తనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపించాలని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ముందు తన కోరికను ఉంచారు యనమల. దీనికి చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. కొద్ది రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

  • Loading...

More Telugu News