: తిరుమలేశుని దర్శనానికి బారులు తీరిన భక్తులు


తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల రెండు కి.మీ. వరకు భక్తులు బారులు తీరారు. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక, కాలినడకన వచ్చే భక్తులకు 14 గంటలు పడుతోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కూడా నిలిపివేశారు. అలాగే కాలినడక మార్గంలో భక్తులను సాయంత్రం 5 గంటల తర్వాత అనుమతించడం లేదు. దర్శనం త్వరగా పూర్తయ్యేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News