: స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ లకు మంత్రి పదవులు!


తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలైన స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ లకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కబోతున్నాయి. ఈ మేరకు ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేసీఆర్, వారిద్దరికీ మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. ఉద్యోగులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని పేర్కొన్నారు. తమది ఉద్యోగి అనుకూల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. కాగా, ఏడాది కిందటే స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ గెలిచారు.

  • Loading...

More Telugu News