: పేటీఎంలో కొత్త కొలువులు... 400 మందికి ఛాన్స్
ప్రముఖ మొబైల్ కామర్స్ సంస్థ ‘పేటీఎం’ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త కొలువులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా 400 ఉద్యోగాలను ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. ఇంజినీరింగ్, సేల్స్, డిజైన్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో భర్తీలు జరుగనున్నాయి. ఈ సంస్థ గత త్రైమాసికంలో 100 ఖాళీలను భర్తీ చేసింది. ఈ ఏడాది చివర్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ కూడా చేపట్టనున్నట్లు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ వర్మ తెలిపారు. 2009లో మొదలైన పేటీఎం సంస్థ ప్రస్తుతం నెలకు 80 లక్షల ఆర్డర్లతో మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ ఏడాది కోటి ఆర్డర్లు తీసుకురావడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.