: నాలుగో రోజుకు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ దీక్ష
విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నిన్ననే దీక్షను భగ్నం చేస్తుందన్న సమాచారంతో వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద జరుగుతున్నదీక్ష వద్దకు చేరుకున్నారు. మరోవైపు పార్టీ మహిళా ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తోంది. అయితే, రాష్ట్ర ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని పూర్తిగా తగ్గించేంతవరకు తమ దీక్ష ఆగదని చెబుతున్నారు. విద్యుత్ కోతలు కూడా ఎత్తివేయాలని కోరారు.