: టి.ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు విఠల్ ఆంధ్రాకు కేటాయింపు


ఉద్యోగుల పంపకాల్లో ఈ రోజు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు విఠల్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. దీనిపై విఠల్ స్పందిస్తూ, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తనను ఆంధ్రా ఇంటర్ బోర్డుకు మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలను ఆంధ్రాకు తరలించేందుకు తెరవెనుక కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తనను సీమాంధ్రకు కేటాయించడంపై మరో పోరాటానికైనా సిద్ధమని చెప్పారు. తాను మెదక్ జిల్లాకు చెందినవాడినని... తనను ఆంధ్రాకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News