: కేసీఆర్ ను కలవడంలో అంతరార్థం ఏమీ లేదు: హరికృష్ణ


తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్న కేసీఆర్ ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తెలిపారు. ఇందులో ఎలాంటి అంతరార్థం లేదని స్పష్టం చేశారు. ఈ రోజు కేసీఆర్ ను కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశానని చెప్పారు.

  • Loading...

More Telugu News