: కేసీఆర్ ను కలసిన హరికృష్ణ, కల్యాణ్ రామ్, కైకాల


తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రముఖులంతా వరుసగా కలుస్తున్నారు. ఈ రోజు టీడీపీ నేత నందమూరి హరికృష్ణ, అతని కుమారుడు, సినీ హీరో కల్యాణ్ రామ్ లు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కూడా కేసీఆర్ ను కలిశారు.

  • Loading...

More Telugu News