: మోడీ ప్రమాణ స్వీకారానికి రానున్న విదేశీ అతిధులు
మోడీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు తరలిరానున్నారు. భారత దేశ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ తొలిసారిగా సార్క్ దేశాధినేతలకు ఆహ్వానాలు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తాను వస్తున్నానంటూ అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కబురందించారు. అలాగే, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ కూడా హాజరుకానున్నారు. జపాన్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్పీకర్ ను పంపించనున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా సమాచారం లేదు.