: చైనాలోని ఉరుంఖిలో డజను బాంబు పేలుళ్లు


చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుంఖిలో పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగాయి. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ ఉదయం రెండు కార్లలో వచ్చిన ఆగంతుకులు బాంబులు విసిరారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఉరుంఖి ప్రాంతంలో యూగర్స్ ముస్లింల ఆధిపత్యం ఎక్కువ. ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్, అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉంటుంది. స్థానికంగా ఆధిపత్యం కలిగిన యూగర్స్ ముస్లింలు, హన్ సెటిలర్స్ మధ్య ఎన్నాళ్లుగానో ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. సెటిలర్స్ సంఖ్య పెరిగిపోతుండడంతో తమ ప్రాంతంలోనే తాము మైనారిటీలుగా మారిపోతామనే అభద్రత యూగర్స్ ముస్లింలలో ఉంది.

  • Loading...

More Telugu News