: నేడే ఎంసెట్... ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం మెడికల్!
ఎంసెట్ -2014 ఈ రోజు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ కు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మెడికల్ కు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 750 సెంటర్లలో జరగనున్న ఈ పరీక్షకు 3,95,670 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురావద్దని, పరీక్ష హాలులోకి ప్రవేశించాక టాయిలెట్ కు కూడా అనుమతించబోమన్నారు. ఆన్ లైన్ దరఖాస్తులను పరీక్ష హాలులో అందజేయాలని, ఎస్సీ-ఎస్టీ విద్యార్ధులు కుల దృవీకరణ పత్రాల అటెస్టెడ్ కాపీలను సమర్పించాలని రమణారావు తెలిపారు. ఇక ఈ రోజు నిర్వహించే ఎంసెట్ కోసం 'క్యూ' కోడ్ ప్రశ్నపత్రాన్ని ఈ ఉదయం ఎంపిక చేశారు.