: జాతీయ పార్టీ హోదా కోసం దరఖాస్తు చేయనున్న టీడీపీ
జాతీయ పార్టీ హోదా కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి టీడీపీ దరఖాస్తు చేయనుంది. అపాయింటెడ్ డే అయిన జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా టీడీపీ కొనసాగనుంది. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కమిటీలను నియమించనుంది. అంతేకాకుండా సీమాంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో 15 శాసనసభ సీట్లు, ఒక లోక్ సభ సీటును గెలుచుకుని టీడీపీ సత్తా చాటింది. దీంతో, రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో, తమను జాతీయ పార్టీగా గుర్తించాలని టీడీపీ కోరనుంది. మరో విషయం ఏమిటంటే, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు వ్యవహరించబోతున్నారు.