: బీజేపీ అవకాశం ఇస్తే ఢిల్లీ సీఎం అవుతా: కిరణ్ బేడీ
బీజేపీ అవకాశం కల్పిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమని మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ తెలిపారు. తాను గత 35-40 ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటున్నానని... తన మిగిలిన జీవితాన్ని ఢిల్లీ సంక్షేమం కోసం త్యాగం చేస్తానని చెప్పారు. గుజరాత్ మోడల్ ను ఢిల్లీలో కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.