: మన్మోహన్ కు లేఖ రాసిన ఒబామా


పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లేఖ రాశారు. ఈ లేఖలో మన్మోహన్ ను గొప్ప నేతగా ఒబామా కొనియాడారు. "దేశంలో ఉన్న లక్షలాది మంది జీవితాల్లో పేదరికాన్ని తొలగించేందుకు మన్మోహన్ చేసిన కృషి... ఆయనను ప్రపంచంలోని గొప్ప నాయకుల్లో ఒకరిగా నిలబెట్టింది. రెండుసార్లు భారత ప్రధానిగా పనిచేసినందుకు అభినందనలు. ఇకపై రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మీతో కలసి పనిచేసే అవకాశం కోల్పోవడం బాధాకరం. భారత్, అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు మీరు చేసిన కృషి అభినందనీయం" అని లేఖలో పేర్కొన్నారు. తామిద్దరం ఆఫ్ఘాన్ లో శాంతిని నెలకొల్పడం, టెర్రరిజం రూపుమాపడం లాంటి అనేక అంశాలలో కలసి పనిచేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News