: కృష్ణా జిల్లాలో రెండు బోర్డర్ చెక్ పోస్టుల ఏర్పాటు


రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణా శాఖ కొత్తగా బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం రవాణా శాఖ ఇప్పటికే పంపిన ప్రతిపాదనలకు విభజన కమిటీ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లాకు సంబంధించి రెండు బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం గరికపాడు వద్ద ఉన్న ఇంటర్నల్ చెక్ పోస్టును బోర్డర్ చెక్ పోస్టుగా మార్చనున్నాయి.

నల్గొండ జిల్లాకు సరిహద్దుగా కోదాడకు వెళ్లే వాహనాల తనిఖీకి గరికపాడు వద్ద బోర్డర్ చెక్ పోస్టును ప్రతిపాదించారు. తిరువూరు శివార్లలో ఖమ్మం జిల్లా సరిహద్దున మరో బోర్డర్ చెక్ పోస్టు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఈ రెండు చెక్ పోస్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి కృష్ణాజిల్లాలోకి వచ్చే వాహనాలు ఈ రెండు చెక్ పోస్టుల వద్ద ట్యాక్స్ చెల్లించి లోపలకు ప్రవేశించాల్సి ఉంటుందని రవాణాశాఖ అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News