: కర్ణాటక ఎన్నికలకు మోడీ ప్రచారం


కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నారు. మే 5న జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే పార్టీ స్థానిక నేతలు తమదైన ప్రచారాన్ని ప్రారంభించారు. పోయిన ఏడాది కర్ణాటక బీజేపీ నుంచి యెడ్డీ బయటకు వెళ్లి సొంతపార్టీ పెట్టుకున్నారు. మరోవైపు ఇటీవల అక్కడి పుర పాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో అక్కడ మళ్లీ అధికారంలోకి రావాలంటే, ప్రధాని పదవికి అభ్యర్థిగా మారుమోగుతున్న మోడీతో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర నేతలు కోరడం, వారు ఆమోదించడం జరిగింది. దీంతో ఈనెల 23 అనంతరం ఎప్పుడైనా మోడీ ప్రచారం ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 15 ప్రాంతాల్లో మోడీ ప్రచారానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News