: కుట్రలు, కుతంత్రాలే వైకాపాను ఓడించాయి: రోజా
ఇచ్చిన హామీలను నెరవేర్చేలా టీడీపీపై ఒత్తిడి తెస్తామని వైకాపా ఎమ్మెల్యే రోజా తెలిపారు. కొత్తవారిని చేర్చుకోకపోవడం కూడా పార్టీకి నష్టాన్ని కలగజేసిందని ఆమె చెప్పారు. కుట్రలు, కుతంత్రాలే తమ పార్టీని ఓడించాయని అన్నారు. మోసపూరిత, అమలు చేయలేని హామీలను తమ అధినేత ఇవ్వలేదని చెప్పారు. ఈ రోజు ఇడుపులపాయలో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు.