: జానారెడ్డిపై మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేతలు
తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా, కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ జానారెడ్డి లేఖ రాయడంపై టీకాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడ్డారు. ఏ హోదాలో ఆయన లేఖ రాశారని ప్రశ్నించారు. పార్టీలో ఎవరినీ సంప్రదించకుండా లేఖ రాయడమనేది దారుణమని అన్నారు. సొంత నిర్ణయాలతో జానారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.