: రుణమాఫీకి చంద్రబాబు కట్టుబడి ఉండాలి: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ లో రైతుల రుణమాఫీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉండాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. బాబు అనుభవం ఉన్న నేత అని, కావున ఇచ్చిన హామీలన్నీ సమర్థవంతంగా పూర్తి నెరవేరుస్తారన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందే రైతు రుణమాఫీ పూర్తి చేసి కొత్త రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని మీడియాతో చెప్పారు. 2004లో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉచిత విద్యుత్, రైతు రుణాలు మాఫీ చేశామన్నారు. ఎంసెట్ లో ప్రవేటు సంస్థలు జోక్యం చేసుకోకుండా ఉండాలని కోరారు.