: డీఎస్పీ హత్య కేసులో యూపీ మాజీ మంత్రికి సీబీఐ నోటీసులు


ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి రాజా భయ్యాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. వారంలోగా తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. మార్చి 2న జరిగిన యూపీ డీఎస్పీ జియా ఉల్ హక్, మరో ఇద్దరి హత్య కేసులో రాజాభయ్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు మాజీ మంత్రికి సంబంధించి ఎలాంటి ఆధారాలను సేకరించలేదు. దాంతో అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా, తన భర్త హత్య కుట్రలో రాజాభయ్యాకు సంబంధం ఉందంటూ డీఎస్పీ భార్య పర్వీన్ అజాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News