: కాంగ్రెస్ తో మాకు, వైకాపాతో సీపీఎంకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ


లేనిపోని భేషజాలకు పోయి కత్తులు నూరుకున్న వామపక్షాలు ఇప్పుడు చింతిస్తున్నాయి. ఎన్నికల్లో పొత్తులు వామపక్షాలకు ఏమాత్రం ఫలితాన్నివ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ రోజు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సమైక్యాంధ్రకు కట్టుబడిన సీపీఎం, రాష్ట్ర విభజన కోరుకున్న సీపీఐ రెండు పార్టీలూ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించలేకపోయాయని చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ, వైకాపాతో కలసిన సీపీఎంలు సాధించిందేమీ లేదని... పొత్తులతో ఒరిగిందేమీ లేదని అన్నారు. వామపక్షాల మధ్య అప్పుడప్పుడు విభేదాలు తలెత్తుతుంటాయని... కానీ, స్నేహమే శాశ్వతమని తెలిపారు. మే 23న రెండు రాష్ట్రాలకు రెండు కమిటీలను ఎన్నుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News